ఏపీ నూతన గవర్నర్‌కు ఘనస్వాగతం

ఏపీ నూతన గవర్నర్‌కు ఘనస్వాగతం
X

రేపు ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిచంనున్న బిశ్వ భూషన్‌ ఇప్పటికే ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వ భూషణ్ హరి చందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘగ స్వాగతం పలికారు. గవర్నర్‌గా నియామకం అయిన తర్వాత తొలిసారి ఏపీకి వచ్చిన హరి చందన్ మొదట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు నుంచి విజయవాడకు వచ్చారు.

ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్‌కు సీఎం జగన్, సీఎస్, డీజీపీ, మంత్రులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. తరువాత సీఎం జగన్‌తో కలిసి పోలీసు ప్రత్యేక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తరువాత ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు గవర్నర్‌కు మేళతాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్‌కు అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని, పట్టు వస్త్రాలను ఆలయ అధికారులు అందించారు.

Tags

Next Story