వావ్.. కొత్త బైక్.. రేటు కూడా అందుబాటు ధరలోనే

వావ్.. కొత్త బైక్.. రేటు కూడా అందుబాటు ధరలోనే
X

కొత్త బైక్ కొనుక్కోవాలనుకునేవారికి శుభవార్త. ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు సీటీ 110. ఇక ధర విషయానికి వస్తే (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) రూ.37,997 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అవి కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్. కిక్ స్టార్ట్ ధర వచ్చి కూ.37,997గా, ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.44,480గా ఉంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కొత్త బైక్‌ను లాంచ్ చేశామని బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. టెక్నాలజీ, స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. మైలేజ్, పవర్, తక్కువ ధర, మన్నిక వంటి అంశాలు అన్నీ ఉన్నాయని తెలిపారు. ఇక ఈ బైక్‌లో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు చూస్తే.. సెమీ నాబీ టైర్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బిగ్గర్ క్రాష్ గార్డ్, అప్‌స్వెప్ట్ ఎక్స్‌హాస్ట్, రబ్బర్ మిర్రర్ కవర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ఇందులో 115 సీసీ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అమర్చింది.

Next Story

RELATED STORIES