ఆడి కారుపై మనసైంది.. అందుకోసం ఏకంగా ఇంట్లోనే..

ఆడి కారుపై మనసైంది.. అందుకోసం ఏకంగా ఇంట్లోనే..

అందరికీ కార్లున్నాయి.. తనకు మాత్రం లేదు.. అయినా అందరికీ ఉన్న కారులాంటిది తనకీ ఉంటే అందులో మజా ఏముంది అనుకుంది.. అందుకే ఆడి కారుపై మనసు పారేసుకుంది. కానీ అంత డబ్బు లేదే. అందుకే ఓ ఫైన్ మార్నింగ్ ఓ మాంచి ఆలోచన చేసింది. జర్మనీకి చెందిన 20 ఏళ్ల యువతి తనకు ఎంతో ఇష్టమైన ఆడి కారును కొనాలని అనుకుంది. అందుకోసం 15వేల యూరోలు (రూ.11 లక్షల 57 వేలు)ఫేక్ కరెన్సీ ముంద్రించింది. వాటిని బ్యాగులో పెట్టుకుని హ్యాపీగా షోరూమ్‌‌కి వెళ్లింది. స్థానికంగా ఉన్న షోరూమ్ కైసర్ స్లేటర్స్ కార్ షోరూంకి వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడింది ఏ3 2013 మోడల్‌ని చూపించమని అడిగింది.

కారు కలర్ నచ్చడంతో డబ్బు చెల్లించేందుకు బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసింది. మంచి నోట్ల మధ్యలో ఫేక్ నోట్లను ఉంచి కౌంటర్‌లో కట్టేసింది. వారి దగ్గర నకిలీ నోట్లను గుర్తించే మిషన్ ఉండడంతో యువతి బండారం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. అనంతరం పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని విచారించగా కరెన్సీని తన ఇంట్లోనే ముద్రించానని తెలిపింది.దాంతో యువతి ఇంట్లో సోదాచేయగా దొంగ నోట్లు ముద్రించే యంత్రాన్ని గుర్తించారు పోలీసులు. యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story