ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి టీడీపీ వాకౌట్

X
TV5 Telugu24 July 2019 7:28 AM GMT
రైతుల సమస్యలపై చర్చించేందుకు కూడా ప్రతిపక్షాలకు శాసనసభలో సమయం ఇవ్వడంలేదని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. ప్రతిపక్షనేత చంద్రబాబుకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. డిప్యూటీ ప్లోర్ లీడర్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు టీడీపీ సభ్యులు. అటు ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
Next Story