రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయాడు.. 170 మంది తల్లిదండ్రులకు కొడుకయ్యాడు

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయాడు.. 170 మంది తల్లిదండ్రులకు కొడుకయ్యాడు

ఉన్నప్పుడు విలువ తెలియదు. వస్తువైనా, మనిషైనా దూరమయ్యాకే తెలుస్తుంది వారిని మనం ఎంత ప్రేమిస్తున్నామో అన్న విషయం. వారి జ్ఞాపకాల్లో బ్రతుకును సాగిస్తూ ఇతరులకు చేయగలిగినంత సాయం చేస్తుంటారు. అలానే గుజరాత్‌లోని అల్థాణ్‌కు చెందిన సోదరులు గౌరాంగ్, హిమాంశు సుఖాడియాలు 170 మంది వృద్ధ తల్లిదండ్రులకు ఉచితంగా ఆహారాన్ని వైద్య సేవలను అందిస్తున్నారు. 2008లో తన తండ్రితో కలిసి కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆ ఘటనలో తండ్రి మరణించగా తాను ప్రాణాలతో బయటపడ్డానని గౌరాంగ్ తెలిపాడు. కళ్లముందే తనను ఎంతగానో ప్రేమించే నాన్న దూరమవడం గౌరాంగ్‌ని కలచి వేసింది. అప్పుడే అనుకున్నాడు కొడుకులకు దూరమై వృద్ధాశ్రమంలో ఉంటున్న

తల్లిదండ్రులకు తానే కొడుకవ్వాలనుకున్నాడు. 2016లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మొదట 40 మంది వృద్ధులకు ఆహారం అందించేవాడు. ప్రస్తుతం 170 మంది వృద్ధులకు సేవలు అందిస్తున్నాడు. ఇందుకోసం తానెవరి సహాయాన్ని కోరనని అంటున్నాడు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రతి నెలా లక్షా 70 వేల రూపాయలు ఖర్చవుతాయని తెలిపాడు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని, వారి సేవలు మరువరానివని అన్నారు. ఈ పనిలో గౌరాంగ్‌ సోదరుడు హిమాంశు సుఖాడియా కూడా పాలు పంచుకుంటాడు.

Tags

Read MoreRead Less
Next Story