కన్నీళ్ళు పెట్టించే కథ.. 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్లా పుట్టలేదు..

కన్నీళ్ళు పెట్టించే కథ.. 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్లా పుట్టలేదు..
X

ఆడ పిల్లలను బతికించండి..చదివిచండి ఎన్ని అవగాహాన కార్యక్రమాలు చేస్తున్న అవి ఏవి కొందరికి చెవులకు ఎక్కడం లేదు. ఆనాగరికపు ఆలోచనలతో ఆడపిల్ల అని తెలియగానే పురిటిలోనే చంపెస్తున్నారు. ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్న రోజులు కూడా ఇలాంటివి జరుగుతుండడం సమాజం వెనక్కి వెళుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆడపిల్ల బతుకు కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న అది వృధా ప్రయాసంగానే మిగిలింది. అమ్మాయి భారంగా చూసేవారి ఆలోచనలో మార్పురావడం లేదు.ఆడపిల్ల పుడుతుంది అని తెలిస్తే చాలు వారిలో రాక్షతత్వం నిద్ర లేస్తుంది. దీనికి తాజాగా జరుగుతున్న కొన్ని సంఘటనలే ఉదాహారణ. ఆడపిల్లలపై ఎంతటి వివక్ష ఉందో అర్ధం అవుతుంది.

ఉత్తరాఖండ్‌‌‌‌ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లాలోని 132 ఊళ్లల్లో గత మూడు నెలల్లో ఒక్కరంటే ఒక్క ఆడ శిశువు కూడా పుట్టలేదు. మూడు నెలల్లో ఆ ఊళ్లల్లో 216 మంది పిల్లలు పుట్టారు, వారందరూ మగ శిశువులేనని లెక్కలు చెబుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌‌‌‌ ఆశిష్‌‌‌‌ చౌహాన్‌ జిల్లా ఆశా వర్కర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. . ఆయా ప్రాంతాల్లోని వైద్యపరీక్షా కేంద్రాలపై నిఘా పెంచారు. చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు జరుగుతున్నాయేమోననీఅధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గర్భంలో ఉంది ఆడ పిల్ల అని తెలియగానే అబార్షనని చేయిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశంపై ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కూడా ఫోకస్ చేశారు. ఈ పరిస్థితిపై అరా తీయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిని అదేశించారు. నిజానికి అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు. ఇది అంతుచిక్కని మిస్టరీలా మారింది. ‘ఆడపిల్ల పుట్టకూడదు’ అనే జాఢ్యం మనిషిలో ఎంతగా నాటుకుపోయిందో ఉదాహరణలా నిలిచింది ఈ సంఘటన.

Next Story

RELATED STORIES