మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వంట కిచెన్‌లోనే చెయ్యాలా.. టాయ్‌లెట్లో చేస్తే తప్పేంటి..

మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వంట కిచెన్‌లోనే చెయ్యాలా.. టాయ్‌లెట్లో చేస్తే తప్పేంటి..
X

తప్పుని ఒప్పకోకపోవడం ఒక తప్పైతే.. ఆ తప్పుని సమర్ధించుకోవడం మరో తప్పు. మహిళా మంత్రి గారు అలానే చేశారు మరి. ఏం మీ ఇంట్లో టాయ్‌లెట్లు లేవా.. అవి వాడకపోతే మరో దాని కోసం వాడుకోరా. అలానే అంగన్ వాడీ టీచర్లు కూడా వాడట్లేదు కదా అని అందులో వంట చేశారు. దాంట్లో తప్పేం ఉందండి అంత రాద్దాంతం చేస్తారు అని ఓ మహిళ.. మంత్రి కూడా అయిన మహిళ ప్రశ్నించడం ఎంత బాధాకరం. మధ్యప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి.. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వంటలు టాయ్‌లెట్లో చేస్తున్నారు అని వస్తున్న వార్తలపై స్పందించారు. పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి.. టాయ్‌లెట్ సీట్‌కు, వంట చేసే స్టవ్‌కు మధ్య గ్యాప్ ఉంటుంది కదా.. మరింక ఏంటి ప్రాబ్లం. ఎందుకంత గొడవ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

అయినా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ అటాచ్డ్ బాత్‌రూంలే ఉంటున్నాయి. ఇంటికి బంధువులు రావట్లేదా.. వారికి వంట చేసి పెట్టట్లేదా అని మాట్లాడారు. బాత్రూమ్‌లు ఇంట్లో ఉంటే భోజనం చేయడం ఏమీ మానట్లేదే అని అన్నారు. ప్రస్తుతం వంట చేస్తున్న బాత్రూమ్ వినియోగంలో లేదని.. రాళ్లు రప్పలతో నిండిపోయిందని వివరించారామె. అందుకే అందులో వంట చేశారు అంటూ అంగన్‌వాడీ ఆయమ్మలను సమర్థిస్తూ మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. బాత్రూమ్‌లో వంట చేసిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రకటించారు మంత్రి ఇమర్తిదేవి. ఈ విషయంపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ స్పందిస్తూ.. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయం సహాయక బృందానికి అప్పగించాం. వారు టాయ్‌లెట్‌ని కిచెన్‌గా మార్చారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

Next Story

RELATED STORIES