మోదీ చేతుల్లో బోసి నవ్వుల్ని చిందిస్తున్న ఆ బుడతడు ఎవరో తెలిసిపోయింది..!

మోదీ చేతుల్లో బోసి నవ్వుల్ని చిందిస్తున్న ఆ బుడతడు ఎవరో తెలిసిపోయింది..!
X

బిజీషెడ్యూల్‌లోనూ ప్రధాని మోదీ తన కోసం వచ్చిన చిన్నారి స్నేహితుడితో కాసేపు సరదాగా ఆడుకున్నారు. పార్లమెంట్‌లో మోదీ.. ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారు అనే క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్‌లతో తెగ వైరల్‌ అయ్యాయి.

మరోవైపు మోదీ చేతుల్లో బోసి నవ్వుల్ని చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు ఎవరో తెలిసిపోయింది

ప్రధాని చేతిలో ఎలాంటి బెరుకు లేకుండా ధీమాగా ఉన్న ఈ బుడతడు బీజేపీ ఎంపీ సత్యనారాయణ జతియా మనవడిగా తేలింది. మర్యాదపూర్వకంగానే మోదీని కలుసుకున్నట్లు ఎంపీ చెప్పారు.

View this post on Instagram

A very special friend came to meet me in Parliament today.

A post shared by Narendra Modi (@narendramodi) on

Next Story

RELATED STORIES