తన తల్లి కిడ్నీ దానం చేసిందన్న వార్తలపై స్పందించిన రానా.. ఏమన్నారంటే

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన శస్త్ర చికిత్స కోసం యుఎస్ వెళ్ళారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. రానా బాగా సన్నబడటంతో అనారోగ్యం కారణంగానే అలా తగ్గిపోయాడన్న ప్రచారం కూడా జరిగింది. ఆ వార్తల్లో నిజమెంత అన్నది తెలియక అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. రానా.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసమే యుఎస్ వెళ్లారని, ఆయనకు తల్లి లక్ష్మి కిడ్నీ దానం చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై రానా స్పందిచారు. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ‘డియర్ కామ్రేడ్’ విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలుపుతూ రానా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ మేరకు ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దానికి స్పందించిన రానా ‘అలాంటి వార్తలు చదవడం ఆపండి’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక స్వయంగా రానాయే తన హెల్త్ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కుదుటపడ్డారు.
View this post on Instagram
#dearcomrade #Rowdy @thedeverakonda my best to you and your team @rashmika_mandanna
A post shared by Rana Daggubati (@ranadaggubati) on
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com