నన్ను చంపేందుకు 'సాక్షి శివానంద్' ప్రయత్నించింది : హీరోయిన్

మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి, విష్ణు సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయమైన శిల్పా ఆనంద్ గుర్తుండే ఉంటుంది. ఆమె అక్క హీరోయిన్ 'సాక్షి శివానంద్' ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించింది. సినిమాలకు దూరంగా ఉంటున్న వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. తనను అంతమొందించేందుకు అక్క సాక్షి శివానంద్ ఆమె అత్త ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేసింది శిల్పా ఆనంద్. ఈ విషయాన్నీ తన ఫేస్ బుక్ పేజీ వేదికగా పంచుకుంది. తనను, తన తల్లిని హత్య చేయడానికి తన సోదరి సాక్షి శివానంద్ అత్త ‘భావన బ్రహ్మభట్’ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
తమను అంతమొందించి ఇన్సురెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. భావన తన భర్తను సైతం హత్య చేసిందని.. దీనిపై తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపింది. హత్య అనంతరం భావన అమెరికా వెళ్లిపోయిందని.. భావన కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని.. భారత్‌కు వస్తే అరెస్ట్ ఖాయమని పేస్ బుక్ వేదికగా ఆరోపించింది. కాగా 2003లో మంచు విష్ణు తొలి సినిమా ‘విష్ణు’తో శిల్పా ఆనంద్ తెరంగేట్రం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com