‘ఓ బేబీ’ కలెక్షన్లు చూస్తే..

‘ఓ బేబీ’ కలెక్షన్లు చూస్తే..
X

సమంత లీడ్ రోల్ లో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓ బేబీ' చిత్రం విజయవంతంగా ఆడుతోంది. 70 ఏళ్ల బామ్మ‌.. 24 ఏళ్ల అమ్మాయిగా మారిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నే క‌థ‌తో తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సమంత నటనను ప్రశంసిస్తున్నారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం మంచి రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల‌ గ్రాస్ వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. లాంగ్ రన్‌లో 50 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.26.64 కోట్ల రూపాయ‌ల‌ను ఈ చిత్రం వ‌సూలు చేసినట్టు సమాచారం. ఇక యూఎస్‌లో ఈ చిత్రం వ‌న్‌ మిలియ‌న్ డాల‌ర్ క్లబ్‌లో చేరింది.

Next Story

RELATED STORIES