తాజా వార్తలు

ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ల ఆగడాలు..

ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ల ఆగడాలు..
X

బుద్ధిగా చదువకోమని లక్షలకు లక్షలు ఫీజు కట్టి కాలేజీలకు పంపిస్తే.. దాడులతో రౌడీయిజం ప్రదర్శిస్తున్నారు స్టూడెంట్స్. ఓ జూనియర్ ని పాత షెడ్డులోకి తీసుకెళ్లి సినిమా విలన్ల తరహాలో చావగొట్టారు. ఫేస్ బుక్ లో వ్యంగ్యంగా కామెంట్ చేశాడని ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. దెబ్బలకు తాళలేక వదిలేయమని జూనియర్ విద్యార్ధి ప్రధేయపడినా సీనియర్లు కనికరించలేదు. బ్యాచ్ గా వచ్చి అతనిపై దాడి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఖమ్మంకు చెందిన శివ కొత్తూరులోని మదర్ థెరిస్సా ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సీనియర్లను కామెంట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడంతో శివను ఓ పాత్ షెడ్డులోకి తీసుకెళ్లారు సీనియర్లు. మమ్మల్నే కామెంట్ చేస్తావా అంటూ అంతా కలిసి అతనిపై దాడి చేశారు. సీనియర్ల ఆగడాలపై శివ సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేస్తుండగా తీసిన ఫూటేజ్ ను పోలీసులకు అందించాడు.

Next Story

RELATED STORIES