Top

చెన్నైలో హద్దుదాటి పోతున్న కాలేజీ స్టూడెంట్స్

చెన్నైలో హద్దుదాటి పోతున్న కాలేజీ స్టూడెంట్స్
X

చెన్నైలో వేటకొడవళ్లు, కత్తులతో బీభత్సం సృష్టించిన స్టూడెంట్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు స్టూడెంట్స్ లో మథన్, సురితిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రౌడీ స్టూడెంట్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధి వసంత్ కుమార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వసంత్ కుమార్ పచ్చయాప్పన్ కాలేజీ ఫిలాసఫీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దాడి జరిగిన సమయంలో మిగిలిన స్టూడెంట్స్ తప్పించుకోగా.. బస్సులోనే ఉండిపోయిన వసంత్ పై విచక్షణరహితంగా దాడి చేశారు.

పచ్చయాప్పన్ కాలేజీ విద్యార్ధుల మధ్య బస్సు రూట్ లో ఆధిపత్య గొడవలే దాడికి కారణంగా తెలుస్తోంది. కాలేజీలో కూడా గొడవలు జరగటంతో పక్కా ప్లాన్ తో అటాక్ చేసినట్లు చెబుతున్నారు. పెరంబూర్- తిరువెర్కడు మధ్య వెళ్లే 29E బస్సులోనే పచ్చయాప్పన్ కాలేజీ విద్యార్ధులు కాలేజీకి వెళ్తుంటారు. బస్సులో రెండు గ్యాంగ్ లకు మధ్య ఆదిపత్య వివాదం తలెత్తటంతో మథన్, సురితి కాలేజీ బ్యాగుల్లో వేటకొడవళ్లు, కత్తులు తీసుకొచ్చారు. బస్సు అరంబాక్కం దగ్గర బస్టాప్ కు చేరుకోగానే కత్తులతో బీభ్సతం సృష్టించారు. ఇద్దరు స్టూడెంట్స్ పరిగెత్తి తప్పించుకున్నారు. కత్తులు విసురుతూ వెంబడించారు. వారిద్దరు దొరక్కపోవటంతో బస్సులోనే ఉన్న వసంత్ కుమార్ పై దాడి చేశారు.

మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో అరంబాక్కం ప్రాంతం భయంతో బెదిరిపోయింది. బస్సులోని ప్రయాణికులు పరుగులు తీశారు. చెన్నైలో బస్సు రూట్లలో స్టూడెంట్స్ పెట్రేగిపోవటం కొత్తేమి కాదు. గతంలోనూ కత్తులు, తల్వార్ లతో ఫుట్ బోర్డింగ్ చేస్తూ స్టూడెంట్స్ బీభత్సం సృష్టించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలె బస్సు డే వేడుకలు నిర్వహించి ఓవరాక్షన్ చేసిన స్టూడెంట్స్ కూడా పచ్చయాప్పన్ కాలేజీ విద్యార్ధులే. దీంతో పోలీసులు పచ్చయాప్పన్ కాలేజీపై స్పెషల్ గా ఫోకస్ చేశారు. విద్యార్ధుల ఆదిపత్య పోరు లేకుండా చర్యలు చేపడుతున్నారు. కాలేజీ స్టాఫ్ తో పాటు విద్యార్ధులు, వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES