నాలుగు రోజుల నరకం ఆవిరైన వేళ..

నాలుగు రోజుల నరకం ఆవిరైన వేళ..

తల్లిదండ్రల ప్రార్థనలు.. వేలాది మంది ప్రజల దీవెనలు ఫలించాయి.. బోసి నవ్వులతో.. చిలిపి మాటలతో అల్లారుముద్దుగా కనిపించిన జషిత్‌ క్షేమంగా తిరిగి వచ్చాడు. కిడ్నాపర్ల చెర నుంచి అమ్మ ఒడికి చేరుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జషిత్‌ కిడ్నాప్‌ మిస్టరి సుఖాంతమైంది..

సోమవారం రాత్రి జషిత్‌ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు.. 17 బృందాలుగా ఏర్పాడిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో కిడ్నాపర్లు భయపడినట్టు ఉన్నారు. భయంతో బాబును వదిలిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుతుకులూరు రోడ్డు దగ్గర అర్ధరాత్రి సమయంలో జషిత్ వదిలేసి పారిపోయారు. బాబును గమనించిన క్వారీ కార్మికులు తమతో తీసుకెళ్లి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుడ్ని మండపేట తీసుకెళ్లిన ఎస్పీ నయీం అస్మి.. జషిత్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.

కిడ్నాపర్ల చెర నుంచి జషిత్ క్షేమంగా ఇంటికి తిరిగిరావటంతో అతని తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బాబు..చిట్టి పొట్టి పలుకులతో మైమరిపించే చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారని తెలిసి కన్న హృదయం తల్లడిల్లిపోయింది. ఏం తిన్నాడో..ఎలా ఉన్నాడో తెలియక అల్లాడిపోయిన తల్లి మనస్సు కొడుకును చూడగానే తేలికైపోయింది. నాలుగు రోజుల నరకం ఆవిరైపోయింది. కొడుకును మనసార ముద్దులతో ముంచెత్తింది. అటు జషిత్ కటుంబ సభ్యులు కూడా బాబు రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కిడ్నాపర్ల బారి నుంచి సేఫ్ ఇంటికి చేరిన జషిత్..ఇంకా షాక్ లోనే ఉన్నాడని అతని తండ్రి వెంకట్రమణ అంటున్నారు. కిడ్నాపర్ల గురించి కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నా..అతనే మాట్లాడుతున్నాడో అర్ధంకావటం లేదంటున్నాడు. జషిత్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెబుతున్నాడు.

ముద్దు ముద్దు మాటలు. ఆపై అల్లరి చేష్టలతో జషిత్ అందర్ని కట్టిపడేస్తున్నాడు. కిడ్నాపర్ ల నుంచి తనను రక్షించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాడు. అమ్మ కావాలని ఏడ్చానంటూ చెబుతున్నాడు. తన కుమారుడు సురక్షితంగా ఇల్లు చేరడంతో జషిత్‌ తల్లి ఆనందానికి అవధుల్లేవు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story