దేశంలో జరుగుతున్న మూకదాడులపై మోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలు

దేశంలో జరుగుతున్న మూకదాడులపై మోదీకి లేఖ రాసిన  సెలబ్రిటీలు
X

దేశంలో జరుగుతున్న మూక దాడులపై గళం విప్పారు సినీ ప్రముఖులు. మూక దాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. దేశంలో ఇలాంటి దీన స్థితికి తాము చింతిస్తున్నామని పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు అనురాగ్ కశ్యప్, మణిరత్నం, నటి కొంకణ సేన్‌శర్మ, రచయిత అమిత్ చౌదరి సహా మరో 42 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు.

దేశంలో ముస్లిం, దళితులపై జరుగుతున్న మూకదాడులపై సినీప్రముఖులు మరోసారి స్పందించారు. గతంలో అసహనంపై తన ఆవేదన వ్యక్తం చేసిన సెలబ్రిటీలు, తాజాగా మూకదాడులపైనా గళం విప్పారు. మూక దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దేశం ఇలాంటి దీన స్థితికి చేరుకోవడంపై తాము చింతిస్తున్నామని లేఖ పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారిందని 49 మంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు అనురాగ్ కశ్యప్, మణిరత్నం, నటి కొంకణ సేన్‌శర్మ, రచయిత అమిత్ చౌదరి సహా మరో 42 మంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేశారు.

శాంతికాముక దేశంలో హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిఘటన లేకుండా ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదని అభిప్రాయపడ్డారు.ముస్లింలు-దళితులు-ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. జై శ్రీరాం పదం వింటే నే ప్రజలు వణికిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పవిత్రమైన రాముడి పేరును ఎందుకు నాశనం చేస్తున్నారంటూ లేఖలో ప్రశ్నించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక చదివి తాము షాకయ్యామని, 2016లోనే దళితులపై 840కి పైగా దాడులు జరిగాయని గుర్తు చేశారు. మోదీ సర్కారు ఏర్పడిన తర్వాతే దాడులు పెరిగిపోయాయని స్పష్టం చేశారు. మూకదాడులను మోదీ ఖండించినప్పటికీ అవి ఆగిపోలేదని గుర్తు చేశారు సినీ ప్రముఖులు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్ల పేరుతో హింసిం చడం సబబు కాదన్నారు. ఆర్టికల్ 19 దేశంలోని ప్రతి ఒక్క పౌరుని భావప్రకటనా స్వేచ్ఛను తెలియజేస్తుంది. అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకు శిక్షలు వేయకూడదన్నారు. దేశంలో ఒక్క పౌరుడు కూడా భయంతో బతకడానికి వీల్లేదని, ఈ దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలనినరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే... ఈ ఆరోపణల్ని కేంద్ర హోంశాఖ ఖండించింది. ప్రధానికి సినీ స్టార్స్ రాసిన లేఖ‌ను తప్పుబట్టింది. ఊహాగానాలు, అబద్దపు ప్రచారాన్ని నమ్మి అవాస్తవాలను ప్రచారం చేయకూడదని హితవు పలికింది.

Next Story

RELATED STORIES