నేనెప్పుడైనా నటనకు గుడ్‌బై..

నేనెప్పుడైనా నటనకు గుడ్‌బై..
X

అమ్మాయిల కలల రాకుమారుడు.. యూత్‌కి ఐకాన్.. నిర్మాతల బంగారు కొండ విజయ దేవరకొండ. అర్జున్ రెడ్డిగా సంచలనాన్నే సృష్టించాడు. గోవిందుడిగా గీతతో పాటు అమ్మాయిలందర్నీ బుట్టలో వేసుకున్నాడు. తాజాగా మరో చిత్రం డియర్ కామ్రెడ్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్.. నేను ఎప్పుడైనా నటనకు స్వస్తి పలకొచ్చు. నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, చేస్తున్నదే చేస్తున్నాననిపించి బోర్ కొట్టినా యాక్టింగ్‌కి గుడ్‌బై చెప్పేస్తాను అన్నారు. ఇక పెళ్లి విషయం గురించి ప్రస్తావిస్తూ మరో ఐదేళ్లు ఆగాల్సిందే అంటున్నారు. మీ చిత్రాల్లో ఎక్కువగా ముద్దుసన్నివేశాలుంటాయంటే.. సెట్‌లో అందరిముందు ముద్దు పెట్టుకోవాలంటే మాక్కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకు హీరోయిన్‌కూడా సహకరిస్తేనే సాధ్యం అవుతుంది. ఆ సన్నివేశం కోసం మేం ఇబ్బంది పడ్డా ప్రేక్షకులకు ఆ విషయం ఏ మాత్రం తెలియకూడదు. నా తరువాతి సినిమాల్లో అలాంటి సన్నివేశాలు వుండవు అంటూ చమత్కరించారు విజయ్.

Next Story

RELATED STORIES