Top

అత్తవాళ్ల ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు.. రోజూ ఇడ్లీ తినిపించాడు .. - జషిత్

అత్తవాళ్ల ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు.. రోజూ ఇడ్లీ తినిపించాడు .. - జషిత్
X

జషిత్ తిరిగొచ్చాడు. సేఫ్ గా అమ్మ ఒడికి చేరుకున్నాడు. 72 గంటల పాటు కిడ్నాపర్ల చెరలో ఉన్న జషిత్ లో జంకు లేదు. బెదురు లేదు. పోలీసులు, జనం గుమికూడినా అతనిలో కించిత్ కూడా ఆందోళన లేదు. అంతేకాదు కిడ్నాపర్లకు సంబంధించిన వివరాలను పాయింట్ పాయింట్ చెబుతున్న ఆ బుడతడి స్మార్ట్ నెస్ అందరిని కట్టిపడేస్తోంది.

అందమైన రూపు. అంతకుమించి తెలివి తేటలు. ముద్దుగొలిపే మాటలు. జషిత్ యాక్టీవ్ నెస్ కు అంతా ఫ్లాట్ అయిపోతున్నారు. ఎస్సీ నయీం అస్మీ సైతం జషిత్ ను పొగడకుండా ఉండలేకపోయారు. కిడ్నాపర్ల చెర నుంచి ఇంటికి సేఫ్ గా తిరిగొచ్చిన తర్వాత జరిగిన విషయాలను తొణక్కుండా బెదరకుండా చెబుతున్నాడు జషిత్. తనను ఎవరో కిడ్నాప్ చేశారని..కిడ్నాపర్లు రోజూ తనకు ఇడ్లీ తినిపించారని చెబుతున్నాడు. అత్త వాళ్ల ఇంటికి తీసుకెళ్తానని రాజు అనే వ్యక్తి తనను వదిలి వెళ్లినట్లు వివరించాడు.

Next Story

RELATED STORIES