మీకు చెప్పను.. మా ఫ్రెండ్స్‌కే చెప్తా..

మీకు చెప్పను.. మా ఫ్రెండ్స్‌కే చెప్తా..

బుజ్జిగాడు ఎంత ముద్దుగా ఉన్నాడో.. వాడ్ని కిడ్నాపర్లు ఏమీ చేయకుండా వదిలిపెట్టాలి దేవుడా అని జషిత్ అమ్మానాన్నతో పాటు ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. నిజంగానే జషిత్‌ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లతో వాడు ఏం మాట్లాడాడో కానీ వారి మనసు కూడా కరిగిపోయింది. భద్రంగా జషిత్‌ని వదిలేశారు. అమ్మానాన్నతో పాటు అశేష ప్రజానీకమంతా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ ఒడిని చేరిన జషిత్ అప్పటి వరకు టాయ్స్ షోరూమ్‌లో ఆడుకుని వచ్చినంత హ్యాపీగా ఉన్నాడు. బుజ్జిగాడిని చూస్తే బోలెడు ప్రశ్నలు వేయాలనిపించింది విలేకర్లకు. వాడు కూడా అంతే కాన్ఫిడెంట్‌గా మీరు ఏది అడిగినా చెప్పేస్తా అనేలా ఉన్నాడు. ముద్దు ముద్దు మాటలతో ఇంకా ముద్దొచ్చేలా మాట్లాడేస్తున్నాడు జషిత్. వాళ్లు నాకు ఇడ్లీలు పెట్టారు. అత్తావాళ్లింటికి తీసుకెళతామన్నారు. ఇలా ఇంకా చాలా మాట్లాడేస్తున్నాడు. మరి నిన్నెవరు కిడ్నాప్ చేసారో తెలుసా అని అడిగేసరికి ఈ తుంటరి పిల్లాడు.. ఇద్దరిలో ఒకరి పేరు తెలియదు.. ఒకరి పేరు మాత్రం తెలుసు.. అయితే అతడి పేరు చెప్పు అనేసరికి .. నేను మీకు చెప్పను.. నా ఫ్రెండ్స్‌కి చెబుతాను అంటు బుడతడు సమాధానం చెప్పేసరికి అక్కడంతా నవ్వులు విరిశాయి. వాడి తెలివితేటలకి అవాక్కయ్యారు పోలీసులు సైతం. జషిత్‌ని అందరూ ముద్దులతో ముంచెత్తారు.

తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. బాలుడి కోసం 17 టీమ్‌లు వర్క్ చేశాయి. పోలీసుల వెతుకులాటలో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రాయవరం మండలం కుతుకులూరి శివారులోని ఇటుకబట్టి వద్ద వదిలి వెళ్లారు. చిన్నారి ఏడుపు విని అక్కడి కూలీలు జషిత్‌ను చేరదీశారు. రాత్రంతా తమ వద్దే వుంచుకున్నారు. ఆకలితో ఉన్న జషిత్‌కి తినడానికి కావలసినవి పెట్టి బాబు తండ్రికి సమాచారం అందించారు. వీడియో కాల్ ద్వారా జషిత్‌ను నిర్ధారించుకున్న ఆయన తండ్రి పోలీసుల సాయంతో చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ నయీం అస్మి బాలుడిని తల్లికి అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story