ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. సుదీర్ఘ చర్చ అనంతరం తలాఖ్ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిల్లుకు అనుకూలంగా 303 మంది ఎంపీలు ఓటు వేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ 82 మంది ఓటు వేశారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2019ను క్లుప్లంగా ట్రిపుల్ తలాక్ బిల్లు అంటారు. గత లోక్‌ సభలోనే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా అక్కడ ఆమోదం పొందింది. రాజ్యసభలో మాత్రం చుక్కెదురైంది. 16వ లోక్‌సభ గడువు ముగియడంతో ఆ బిల్లు కాలం చెల్లిపోయింది. దాంతో మోదీ సర్కారు మళ్లీ ట్రిపుల్ తలాఖ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story