అప్పుడు అబ్బాయిగా.. ఇప్పుడు అమ్మాయిగా.. గర్భం దాల్చే అవకాశం కూడా..

అప్పుడు అబ్బాయిగా.. ఇప్పుడు అమ్మాయిగా.. గర్భం దాల్చే అవకాశం కూడా..
X

అమ్మాయిలు అబ్బాయిల్లాగా షర్టూ ఫ్యాంట్ వేసుకున్నాఅంతర్గతంగా వారు అమ్మాయిలే అన్న విషయాన్ని మాటలు, చేతలు తెలియజేస్తాయి. కానీ కొందరి విషయంలో మాత్రం మనసు సొద పెడుతుంది. నువ్వు అబ్బాయివి కావు అమ్మాయిగా మారిపో అంటూ తొందర చేస్తుంది. ఎవరేమనుకున్నా ఇక లాభం లేదనుకుని తన మనసు చెప్పిన మాటకు కట్టుబడాల్సి కావలసినట్టు మారిపోతారు. బీహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన 22 ఏళ్ల మనీష్ ఆపరేషన్ చేయించుకుని అమ్మాయి మనీషగా మారిపోయాడు. మనీష్‌కి పుట్టుకతోనే జననాంగ లోపం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. మనీష్‌ని హిజ్రాగా భావించి పెంచి పెద్దచేశారు. అయిదవ తరగతి వరకు చదువుకున్న మనీష్ బట్టల షాపులో సేల్స్ బాయ్‌గా చేరాడు. మనీష్ ఎదుగుతున్న క్రమంలో అమ్మాయి లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. ఈ విషయాన్ని తల్లికి చెప్పాడు మనీష్. దీంతో ఆమే కొడుకుని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లింది. డాక్టర్లు మనీష్‌కి అన్ని పరీక్షలు చేసి అమ్మాయిగా తేల్చారు. అందుకు చిన్నపాటి శస్త్రచికిత్స చేసి మనీష్‌‌ని మనీషగా మార్చేశారు. ఇప్పుడు ఆమె నచ్చిన వాడిని వెతుక్కుని హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనొచ్చని చెప్పారు డాక్టర్లు.

Next Story

RELATED STORIES