రాజీవ్‌ హత్యకేసులో నిందితురాలు నళిని పెరోల్‌ పై విడుదల

రాజీవ్‌ హత్యకేసులో నిందితురాలు నళిని పెరోల్‌ పై విడుదల
X

దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని వెల్లూరు జైలు నుంచి విడుదలైంది. వేలూరు జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఓ బిడ్డకు నళిని జన్మనిచ్చింది. అదే బిడ్డ పెళ్లి ఏర్పాటు కోసం 30 రోజుల పెరోల్‌పై బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. నళిని 25 ఏళ్లుగా జైల్లోనే ఉంటోంది. రాజీవ్‌ హత్య కేసులో నళినితోపాటు 7 మంది శిక్ష పడింది. ఆమెకు ఉరిశిక్ష పడ్డప్పటికీ ఆ తర్వాత యావజ్జీవ శిక్షగా మార్చారు.

నళిని పెరోల్‌ కోసం 6 నెలల క్రితం దరఖాస్తు చేసింది. పిటిషన్‌పై విచారణ గత నెలలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. దీని ప్రకారం ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు మద్రాస్‌ హైకోర్టులో గట్టి పోలీసు బందోబస్తు మధ్య నళినిని హాజరుపరిచారు. వాదనల తర్వాత కుమార్తె వివాహం కోసం నెల రోజుల పెరోల్‌ను నళిని కల్పించారు. ఆ తర్వాత నళిని ఎక్కడ ఉండబోతోంది ఇతరత్రా భద్రతా చర్యలపై దర్యాప్తు తర్వాత కోర్టు పెరోల్‌ మంజూరు చేసింది.

సింగరయార్‌ తమిళనాడు తమిళ జాతీయ అసెంబ్లీ రాష్ట్ర కార్యదర్శి రంగపురం పులవర్‌ ఇంట్లో నళిని ఉండబోతోంది. కూతురు పెళ్లి పనులు పూర్తయ్యాక నళిని తిరిగి జైలుకు వెళుతుంది. నళిని భర్త మురుగున్‌ పెరోల్‌ కోసం దరఖాస్తు చేయలేదు. కూతురు పెళ్లయిన తర్వాత పెరోల్‌ అడగవచ్చని సమాచారం.

Next Story

RELATED STORIES