ఇప్పటికే ఏడు హత్యలు, 285 దాడులు జరిగాయి : చంద్రబాబు

ఏపీలో వైసీపీ దాడులు పెరిగిపోయాయన్నారు విపక్షనేత చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలపై 285 దాడులు జరిగాయన్నారు. 65 ఆస్తుల్ని ధ్వంసం చేశారని, 11 భూకజ్బాలు చేశారన్నారు. 24 చోట్ల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఏడు హత్యలు జరిగాయని ఆరోపించారు చంద్రబాబు.
వైసీపీ శ్రేణుల దౌర్జన్యాలు, దాడుల్ని అడ్డుకుంటామన్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశామన్నారాయన. టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు చంద్రబాబు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వడం లేదని, మాట్లాడదామంటే స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.
అటు.. పోలీసులు సైతం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు చంద్రబాబు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని గుర్తు చేశారాయన. రాజకీయ నేతలకే కాదు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు చంద్రబాబు. వైసీపీ దాడుల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com