తాజా వార్తలు

సహజీవనం హద్దులు దాటుతోంది.. ముద్దూ ముచ్చట్లు నెట్టింట్లో..

సహజీవనం హద్దులు దాటుతోంది.. ముద్దూ ముచ్చట్లు నెట్టింట్లో..
X

ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ మంటగలుస్తున్నాయి. మూడుముళ్ళ బంధంతో ఒక్కటవ్వాల్సిన జంటలు పాశ్చాత్య పోకడల పుణ్యమా అని డేటింగ్ పేరుతో అపవిత్ర బంధంతో ఒక్కటవుతున్నారు. చివరకు చిక్కుల్లో పడి జీవితాన్నే బలి చేసుకుంటున్నారు. ఈ సంస్కృతి క్రమక్రమంగా దేశం మెుత్తం పాకిపోతోంది. సహజీవనాల పేరిట హద్దులు దాటుతూ చేటు చేసుకుంటున్నారు. డేటింగ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా తీసుకున్న వీడియోలు అమ్మాయిల పాలిట నరకప్రాయమవుతున్నాయి. కలిసి ఉన్నంత వరకు ఒకే.. దురదృష్టం తలుపు తట్టి ఇద్దరి మధ్య సంబంధం చెడిపోతే మాత్రం యువతులకు కష్టాలు మొదలవుతున్నాయి. ఇద్దరూ కలిసి ఉన్నంత వరకు బాగానే ఉన్న మనస్పర్ధలతో విడిపోయినప్పుడు యువకుడి లోపలి మనిషి బయటకొస్తున్నాడు. మాజీ ప్రేమికురాలిపై కక్షతో చేయడానికి ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలవుతున్నారు.

ప్రేమ ఓ తీయటి అనుభూతి.. యువత దానికి ఆకర్షితులు కావడం సహజమే. ప్రేమకు పాశ్చాత్య సంస్కృతి తెగులు పట్టిస్తోంది. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న యువత దాన్నిమరో మెట్టు ఎక్కిస్తున్నారు. పెళ్ళి ముందు హనీమూన్లకు రెడీ అవుతున్నారు. ప్రేమ బంధం నుంచి వివాహ బంధంతో ఒక్కటైతే సరే లేదా కొందరు యువకుల్లో రాక్షసత్వం నిద్ర లేచి హనీమూన్ వీడియోలు అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. ఇద్దరి మధ్య వచ్చే అభిప్రాయ బేధాలు యువతుల జీవితాలను బలి చేస్తున్నాయి. అబ్బాయిల అహం దెబ్బతిని బెదిరింపుల పర్వానికి తెర లేపుతున్నారు. లొంగకపోతే.. దాచుకున్న చిత్రాలతో బెదిరింపులకు గురిచేసున్నారు. దీంతో అమ్మాయిల జీవితం కష్టాల కడలిలో మునుగుతోంది. వీడియోలు, చిత్రాల్ని అశ్లీల సైట్‌లోకి వెళ్ళుతున్నాయి. ఈ పని చేసిన యువకులు చివరకు చట్టానికి చిక్కేలోపు అమ్మాయిలు జీవితాలకు జరగాల్సిన డామేజ్ అంతా జరిగిపోతుంది. సో అమ్మాయిలూ బీ కేర్ పుల్.. అబ్బాయిల రూపాన్ని.. కల్లబొల్లి కబుర్లని చూసి మోసపోకండి. మనస్తత్వాన్ని చూసి ప్రేమించండి. ఆలోచించి అడుగులు వేయండి.

Next Story

RELATED STORIES