వరద బీభత్సం.. 16 మంది మృతి

X
By - TV5 Telugu |26 July 2019 11:10 AM IST
చైనాలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. వర్షాలు, వరదలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రకృతి బీభత్సానికి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇంకో 30 మంది గల్లంతయ్యారు సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకొని బాధితులకు సాయం చేశారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టారు.
గుయిజ్‌హౌ ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వానల దెబ్బకు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. హెజ్‌గాంగ్ ఏరియాలో మరొకరు మృతి చెందారు. 11 మంది గాయపడగా చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com