కర్నూలు జిల్లాలో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన శనగ రైతులు

కర్నూలు జిల్లాలో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన శనగ రైతులు

కర్నూలు జిల్లాలో శనగ పంట సాగు చేసిన రైతన్నలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారు.. గిట్టుబాటు ధర లేకపోవడంతో శనగ పంటను గత మూడేళ్ల నుంచి రైతులు గోదాముల్లో పంటను నిల్వ ఉంచారు.. ధర వస్తుందేమోనని ఎదురుచూశారు. మద్దతు ధర రాకపోవడంతో పంటను అమ్ముకోలేక పోతున్నారు. దీంతో రైతులకు ఆర్థిక భారం పెరిగిపోతోంది..

పంటపై రుణం తెచ్చుకున్న రైతన్నలను బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయ. ఇప్పటికే అనేక సార్లు బ్యాంకులు నోటీసులు పంపించాయి రైతులు తీసుకున్న రుణం కాలపరిమితి పూర్తయిందని రుణం చెల్లించాలంటున్నాయి. మరోవైపు గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన ధాన్యంపై నిలువ చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి..

2017వో ఒక్క కోయిలకుంట్ల సబ్ డివిజన్ లోనే 62 వేల హెక్టార్లలో అత్యధికంగా శనగ పంట సాగు జరిగింది.. 6 లక్షల 50 వేల క్వింటాళ్ల శెనగ దిగుబడి వచ్చింది. . గత ఏడాది వర్షాభావం కారణంగా 37 వేల హెక్టార్లలో శనగ పంట సాగు చేశారు. లక్ష 15వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒక హెక్టారు శనగ పంట సాగుకు 50 వేలు పైగా అ ఖర్చు చేశారు. హెక్తారు కు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులవల్ల 10 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది... మార్కెట్లో క్వింటానికి రూ . 3500 నుంచి రూ .4300 వరకు గల పలికింది . ఈ లెక్కన రైతు హెక్టారుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు నష్టం వాటిల్లింది.... ప్రభుత్వం శనగలకు మద్దతు ధర 4650 గా నిర్ణయించింది... శనగ కు మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు ఈ ధరకు కొనేందుకు ముందుకు రాలేదు..

గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను అమ్ముకునేందుకు సాహసించలేదు రైతులు. . గత రెండేళ్లుగా సరైన ధర లేకపోవడంతో శనగలను నిల్వ ఉంచుకున్నారు. ఇలా ఒక్కో రైతు వద్ద 50 , 100 , 200 క్వింటాళ్ల శనగలు నిల్వ ఉండి పోయాయి. ప్రభుత్వం మాత్రం 30 క్వింటాళ్ల కు మాత్రమే 15వందల రూపాయల చొప్పున ఇన్సెంటివ్ ఇస్తామంటోంది. ఈ ప్రకటన రైతుల్లో ఆనందాన్ని నింపింది. కానీ గోదాముల్లో నిల్వచేసిన శనగ లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతుండడంతో గోడలలో నిల్వ చేసుకునే స్థోమత లేక ఇళ్లలోనే ధాన్యాన్ని నిల్వ చేసుకున్నామని ప్రభుత్వ నిబంధన వల్ల ఇన్సెంటివ్ కోల్పోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..

పరిమితులు విధించడం సబబు కాదు:-

తీవ్రంగా నష్టపోయిన శనగ రైతుల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని పలువురు రైతులు కోరుతున్నారు.. గోదాముల్లో ఉంచిన శనగ పంట రైతులకు 30 కింటా లకు మాత్రమే.. క్వింటాని కి రూ.1500 చొప్పున ఇన్సెంటివ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమని రైతులు చెందుతున్నారు.. గిట్టుబాటు ధర లభించకపోవడంతో గత రెండు సంవత్సరాలుగా పండిన పంటను రైతులు అమ్ముకోలేక నిల్వ ఉంచుకున్నారని ..రైతుల వద్ద ఉన్న ప్రతి బస్తాకు ఇన్సెంటివ్ ఇవ్వాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

గోదాముల్లో నిలువ ఉంచుకున్న ధాన్యంపై బ్యాంకుల్లో రైతులు రుణాలు పొందారు ... ఆరు నెలల లోపు పంట ను అమ్ముకొని బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సి ఉంది.. సరైన గిట్టుబాటు ధర లేని కారణంగా రైతులు తమ పంట నమ్ముకోక గోదాముల్లోని అలానే ఉంచారు ... గడువు ముగిసి సంవత్సరం పై గా కావడంతో బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల మేరకు వేలానికి సిద్ధమవుతున్నాయి ఇప్పటికే పలు దఫాలుగా రైతులకు బ్యాంకులు నోటీసులు పంపాయి... రైతుల నుండి స్పందన రాకపోవడంతో బ్యాంకులు వేలానికి సిద్ధమవుతున్నాయి... ఒక్క కోయిలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో నే స్టేట్ బ్యాంక్ సెనగ ధాన్యం పై 2300 మంది రైతులకు 90 కోట్ల పైగా రుణాలు అందించింది.... స్టేట్ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకులు సైతం ధాన్యం పై రైతులకు రుణాలు అందించాయి .. ఈ బ్యాంకులు కూడా వేలానికి సిద్ధమవుతున్నాయి... దీంతో రైతన్న ల్లో టెన్షన్ మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story