పులులేంటి.. లాలీపాప్స్ తినడం ఏంటి.. ఎక్కడో తెలుసా మరి..

పులులేంటి.. లాలీపాప్స్ తినడం ఏంటి.. ఎక్కడో తెలుసా మరి..

ఏవిటో ఈ చిత్రాలు.. పాములకు వాటర్ బాటిల్‌తో నీళ్లు పట్టడాలు.. పులులకు లాలీపాప్‌లు తినిపించడాలు. మనుషులకు ఉన్న అడ్డమైన అలవాట్లన్నీ వాటికి నేర్పిస్తున్నామా లేక వాటి మనసులో ఆంతర్యాన్ని గ్రహించి మసలుకుంటున్నామా.. ప్చ్ అంతా మాయగా ఉంది.. ఏం అర్థం కావట్లేదు. ఆకలేస్తే అమాంతం జింకపైక దూకి రెప్పపాటులో దాన్ని చంపి తినేసే పులి.. ఆకలేసినా తినకుండా మూతి బిగించుక్కూర్చుంటే ఏమనుకోవాలి. అందుకే మరేదైనా ప్రత్యామ్నాయం ఉందేమో అని ఆలోచించారు. అసలే వేడిగా వుంది.. మనమే కూల్ డ్రింకులు, ఐస్‌ క్రీంలు తిని కడుపు చల్లబరుచుకుంటున్నాం. దాన్నిక్కూడా అవే కావాలేమో. అడగట్లేదు కానీ.. పెడితే తింటుందేమో ట్రై చేద్దాం అని మాంసాన్ని మంచు లాలీపాప్స్‌గా తయారు చేసి ఇస్తుంటే.. అవి కూడా ఎంచక్కా చల్ల చల్లగా ఉన్న లాలీపాప్స్‌ని లొట్టలేసుకుంటూ తినేస్తున్నాయి.

బ్రిటన్‌లో వడగాలులకు మనుషులతో పాటు మూగజీవాలు కూడా అల్లాడి పోతున్నాయి. వేసవి తాపం తాళలేక అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి. దీన్ని నివారించేదెలా అని ఓ ఉపాయం ఆలోచించారు జూ అధికారులు. లండన్ జెడ్ఎస్ఎల్ జంతుప్రదర్శనశాలలోని ఆసిమ్ అనే ఏడు సంవత్సరాల పెద్దపులి అధిక వేడి కారణంగా మాంసాన్ని ఇష్టంగా తినట్లేదు. పులి పిల్లిలా ఓ మూల కూర్చుంటుందేవిటి అని ఆందోళన చెందారు. ఆసిమ్ ఇష్టంగా తినే కోడి తొడలనే లాలీపాప్ ఆకారంలో మార్చి అవి సంచరించే ప్రాంతంలో వేలాడదీశారు. దీంతో ఆసిమ్ కూల్ కూల్‌గా కోడి తోడలను లొట్టలేసుకుంటూ లాగించేస్తోంది. జూలోని ఇతర జంతువులకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు జూ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story