పులిని కొట్టి చంపిన గ్రామస్తులు.. 43 మందిపై కేసు నమోదు

పులిని కొట్టి చంపిన గ్రామస్తులు.. 43 మందిపై కేసు నమోదు
X

ఉత్తర ప్రదేశ్‌లోని పిలిబిత్‌లో ఓ పులి బీభత్సం సృష్టించింది. జనావాసాల్లోకి దూరిన పులి.. స్థానికులపై దాడికి దిగింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోపంతో ఊగిపోయిన స్థానిక గ్రామస్తులు.. పులిపై కర్రలతో దాడికి దిగారు. విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో దెబ్బలకు తాళలేక ఆ పులి అక్కడికక్కడే మృతి చెందింది. పులిని చంపిన 43 మందిపై ఫారెస్ట్‌ అధికారులు కేసులు నమోదు చేశారు. చంపిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story

RELATED STORIES