టిక్‌టాక్ వీడియో చేస్తూ నీటిలో కొట్టుకుపోయిన యువకులు

టిక్‌టాక్ వీడియో చేస్తూ నీటిలో కొట్టుకుపోయిన యువకులు
X

టిక్‌ టాక్‌ కోసం నేటి యువత ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. టిక్‌ టాక్‌ మోజులో పడి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. బీహార్‌లోని దర్భంగాలో కొందరు యువకులు వరదలతో ఆటలాడుకున్నారు. టిక్‌ టాక్‌ కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో దూకి పోకిరి వేషాలు వేశారు.

టిక్‌ టాక్‌ సరదా ఏకంగా వారి ప్రాణాల మీదకే తెచ్చింది. యువకులు దూకిన సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి మరింత పెరగడంతో.. నీటిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది యువకులను కాపాడారు. టిక్‌ టాక్‌ ప్రభావం యువతపై ఎంతుందో ఈ ఘటన నిరూపిస్తోంది.

Tags

Next Story