విదేశాల్లోనూ ట్రిపుల్ తలాఖ్ వివాదం

ట్రిపుల్ తలాఖ్ వ్యవహారం విదేశాల్లోనూ వివాదం రేపుతోంది. మలేషియా మాజీ రాజు సుల్తాన్ మహ్మద్, తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ ద్వారా విడాకులు ఇచ్చారనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఎంఎస్ రిహానా ఆక్సానా గోర్బాటెంకోకు సుల్తాన్ అహ్మద్ విడాకులు ఇచ్చారని, ట్రిపుల్ తలాఖ్ పద్దతిలో డైవోర్స్ చెప్పా రని రాజు తరఫు లాయర్ వెల్లడించారు. జూన్ 22నే ఈ వ్యవహారం జరిగిపోయిందని వివరించారు. సుల్తాన్ మహ్మద్ కారణంగా ఆక్సానాకు కొడుకు పుట్టాడనే వార్తల్లో నిజం లేదన్నారు.
తలాఖ్ వార్తలను మలేషియా మాజీ రాజు భార్య రిహానా తీవ్రంగా ఖండించారు. సుల్తాన్ మహ్మద్‌కు, తనకు విడాకులు కాలేదని స్పష్టం చేశారు. తామిద్దరం కలసి తీసుకున్న ఫోటోలు, తమ కుమారుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుల్తాన్‌తో తనకు కుమారుడు కలగలేదన్న లాయర్ వాదనను ఆక్సానా తోసిపుచ్చారు. బాధ్యతారహి తంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో రాజు పదవి నుంచి మహమ్మద్ వైదొలిగారు. అప్పట్లో సీక్రెట్ మ్యారేజ్ తో వార్తల్లోకెక్కిన మహమ్మద్, ఇప్పుడు ట్రిపుల్ తలాఖ్‌తో మరోసారి చర్చనీయాంశమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com