ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నాడని ఉన్నతాధికారిపై కత్తితో దాడి

ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నాడని ఉన్నతాధికారిపై కత్తితో దాడి
X

ప్రమోషన్ రాకుండా తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాడంటూ ఉన్నతాధికారిపై కత్తితో దాడి చేశాడు ఓ ఉద్యోగి. హైదరాబాద్ ఉప్పల్ లోని CEFD ఉద్యోగులైన ఏవో వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ శర్మ మధ్య కొంత కాలంగా వివాదం జరుగుతోంది. తనకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చాడని శర్మ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో ఏవో వెంకటేశ్వరరావుతో శర్మ వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరగటంతో కత్తితో దాడి చేశాడు శర్మ. ఈ ఘటనలో వెంకటేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి.

Tags

Next Story