వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారు : కన్నా లక్ష్మీనారాయణ

X
ఏపీలో టీడీపీ, వైసీపీకి భవిష్యత్తు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ లో టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుగానీ, లోకేష్ కు గానీ లేవని చెబుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో సభ్యత్వ నమోదు తర్వాత జిల్లా కార్యకవర్గ సమావేశంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ..రాబోయే రోజుల్లో బీజేపీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే టీడీపీ నుంచి వలసలు ప్రారంభం అయ్యాయని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
