అరుదైన ఘనత.. భర్తకు 1వ ర్యాంక్‌.. భార్యకు 2వ ర్యాంక్‌

అరుదైన ఘనత.. భర్తకు 1వ ర్యాంక్‌.. భార్యకు 2వ ర్యాంక్‌

భర్త అడుగు జాడల్లో నడవడం అనేది భారతీయ స్త్రీకి ఉన్న గొప్ప లక్షణం. అలానే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చదివి ఆయనతో పాటు ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో అగ్ర శ్రేణిలో నిలిచింది. భర్త మెుదటి స్ధానాన్ని సాధించగా రెండో స్ధానాన్ని భార్య స్ధానలంలో. ఇద్దరూ కలిసి పరీక్షలకు సన్నద్దమై ఈ అరుదైన ఘనతను సాధించారు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌ సింగ్‌ పభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చదువు పూర్తవ్వగానే ఛత్తీస్‌గఢ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగాలనకు సిద్ధం అవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పెళ్లవడంతో తన భార్య విభా సింగ్‌ను కూడా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించాడు. భర్త పోత్సాహంతో ఆమె కూడా పరీక్షలకు సిద్ధమైంది. దీంతో ఇద్దరూ కలిసి పరీక్షకు సన్నద్దమయ్యారు. ఇటీవల జరిగిన చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బీ, గ్రేడ్‌ సీ) పరీక్షకు వీరిద్దరూ హాజరయ్యారు. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు . అనుభవ్‌కు 298.3744 మార్కులు, విభా సింగ్‌కు 283.9151 మార్కులు వచ్చాయి. ఈ విజయంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. " అనుకునన్నది సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఒకరికొకరి సాయం చేసుకుని ఈ విజయాన్ని సాధించాం. ఈ అద్భుత విజయం వెనుక కుటుంబసభ్యుల తోర్పాటు కూడా ఉంది’ అని సంతోషం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story