ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నువ్వా- నేనా అన్నట్లు పోటీ

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నువ్వా- నేనా అన్నట్లు పోటీ

గత కొద్దిరోజులుగా సినిమా పరిశ్రమలో హీట్ రాజేసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు హోరాహోరిగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మన ప్యానల్ కు, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్స్ కు మధ్య పోటీ నువ్వా- నేనా అన్నట్టు సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. అనంతరం సాయంత్రం 5గంటల కల్లా ఫలితాలు వెల్లడవుతాయి. ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు.

ఎగ్జిబీటర్స్, స్టూడియో యజమానులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధులు ఫిల్మ్ ఛాంబర్ లో సభ్యులుగా ఉన్నారు. నిర్మాతలే ఎక్కువమంది ఇందులో పదవుల కోసం పోటీపడుతున్నారు. యాక్టీవ్ ప్రొడ్యూసర్ ప్యానల్ నుంచి దామోదర ప్రసాద్, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డీవీవీ దానయ్య, సాయి కొర్రపాటి, దిల్ రాజు, నాగవంశీ తదితరులు రేసులో ఉన్నారు. వీరికి పోటీగా వైవీఎస్ చౌదరి, ప్రసన్నకుమార్, నట్టికుమార్, వి.సాగర్, శివకుమార్ లు రంగంలో దిగారు. పెద్ద పెద్ద నిర్మాతలు పోటీలో ఉండడంతో గతంలో కంటే ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఏసియన్ అధినేత నారాయణదాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవుల కోసం పోలింగ్ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story