తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

అటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. అల్పపీడన ప్రభావంతో విశాఖ ఎజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా ముంచుంగిపుట్టు మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.. ముంచంగిపుట్టు మండలం కర్లపొదర్‌ గ్రామ సమీపంలో ఓ కల్వర్టు కొట్టుకుపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్వర్లు పూర్తిగా మునిగిపోయి బలహీనపడింది. ఈ ఉదయం కల్వర్టు పూర్తిగా తెగిపోవడంతో... 27 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఒడిశాకు చెందిన 53 గ్రామాల వారికి సైతం రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏటూరునాగారం మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.. గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story