చిన్నమ్మ వచ్చేస్తున్నారా!

చిన్నమ్మ  వచ్చేస్తున్నారా!
X

శశికళ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండున్నర ఏళ్లుగా కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు టీటీవీ దినకరన్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం తమిళ రాజకీయాలలో కొత్త అనిశ్చితి కారణమయే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే అన్నాడీఎంకేలోని ఆమె విశ్వాసపాత్రులు తిరిగి శశికళ పంచన చేరే అవకాశం ఉంది. దీంతో అన్నాడీఎంకే భవిష్యత్తు ఏంటనేది పలువురు రాజకీయ విశ్లేషకులలో చర్చ మెుదలయింది. అలాగే టీటీవీ దినకరన్‌ స్ధాపించిన ఏఎంఎం పరిస్థితి ఏంటనేది కూడా పలువురు విశ్లేషించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఏఎంఎంకే నుంచి కీలక నేతలు బయటకు వెళ్ళడంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నర్ధాకంగా మారింది. ఈ నేపథ్యంలో శశికళ విడుదలైతే ఏఎంఎంకే పార్టీపై దృష్టి పెడతారా? లేక అన్నాడీఎంకేలోని తన విశ్వాసపాత్రుల సహాయంతో ఆ పార్టీనే తిరిగి తన కనుసన్నల్లోకి తెచ్చుకుంటారా? అనే తదితర ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. జైలులో ఉన్న ‘చిన్నమ్మ’ను ముందుగానే బయటకు తీసుకొచ్చేందుకు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

శిక్షా కాలానికి ముందే శశికళ విడుదలైతే తమిళ రాజకీయాలు ఏవైపు తిరుగుతాయనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. అన్నాడీఎంకేలో ఉన్న శశికళ పూర్వపు విశ్వాసులకు ఈ విషయం కొత్త సంతోషాన్ని కలుగజేస్తుంది. ఒక్కవేళ పార్టీ చిన్నమ్మ చేతుల్లోకి వెళితే తమకు అన్నాడీఎంకేలో పెద్ద పీట ఉంటుందనే భావన వారిలో ఉంది. ఆ భావనకు బలం చేకూర్చేలా బాహాటంగానే పలువురు అన్నాడీఎంకే నేతలు శశికళ విడుదలను సమర్ధిస్తున్నారు. శశికళను చట్టపరంగా బయటకు తీసుకొస్తే సంతోషమేఅంటూ వ్యాఖ్యలు చేశారు పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ. కీలక నేతలు, మంత్రులు, పార్టీ ప్రముఖులు ‘చిన్నమ్మ’ వైపునకు చేరితే అన్నాడీఎంకేలో ఇక కుదుపులు తప్పవని అర్ధమవుతోంది. ఇప్పటి నాయకత్వంలో పార్టీ పరిస్ధితి రోజురోజుకు దిగజారుతుండడం, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరజాయన్ని ఎదుర్కొవడంతో ప్రస్తుత న్యాయకత్వంపై నేతలకు నమక్మం సన్నగిల్లితుంది. దీంతో వారు సమర్ధ నాయకత్వం వైపు చూస్తున్నారు. అది శశికళ ద్వారానే సాధ్యమనేది పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళ రాజకీయంలో శశికళ విడుదల ఎలాంటి ప్రకంపనాలను రేపుతుందో వేచి చూడాలి.

Next Story

RELATED STORIES