కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం.. సడన్ గా ట్విస్ట్..

X
By - TV5 Telugu |28 July 2019 12:38 PM IST
కర్నాటకం కీలక మలుపు తిరిగింది.. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.. దీంతో మొత్తం 14 మందిపై అనర్హత వేటు పడింది. సిద్దరామయ్య, దినేష్ గుండూరావు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్‌తో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ రమేష్ కుమార్.. కుమారస్వామి, దేవెగౌడ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్‌తో ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు.. మొత్తం 14 మందిని బర్తరఫ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.. మూడు రోజుల్లో స్పందించాలని వారందరికీ సూచించారు.. రెండ్రోజుల్లో యడియూరప్ప అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com