Top

కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు

కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు
X

కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలనపై మోదీ సర్కారు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఓ వైపు భారీగా భద్రతా బలగాలను మోహరిస్తునే, మరోవైపు దర్యాప్తు సంస్థలతో కూపీ లాగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ-NIA మరోసారి రంగంలోకి దిగింది. ఉగ్రనిధుల కేసులో భాగంగా NIA అధికారులు జమ్మూ కశ్మీర్‌లో సోదాలు చేస్తున్నారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో ఏకకాలంలో 4 చోట్ల ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడి ఇళ్లను జల్లెడపడుతున్నారు.

ఏడేళ్ల క్రితమే టెర్రర్‌ ఫండింగ్ కేసు నమోదైంది. 2012లో ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో వేర్పాటువాద నేతలు మస్రత్ ఆలం, అసియా ఆంద్రబి, షబీర్ షా సహా 1 2మందిపై అభియోగాలు నమోదుచేసింది. NIA అధికారులు గతవారం మస్రత్ ఆలంను జమ్మూ కశ్మీర్ జైలు నుంచి ఢిల్లీ నుంచి తరలించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఆ డేటా ఆధారంగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.

Next Story

RELATED STORIES