మార్కెట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

X
చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లిలో మార్కెట్ వ్యాపారి సుబ్బయ్య కిడ్నాప్ కలకలం రేపింది. స్కూటర్‌పై వెళ్తున్న సబ్బయ్యను కొట్టి నోటికి ప్లాస్టర్ చుట్టి ఎత్తుకెళ్లారు దుండగులు. సబ్బయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 20 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. డబ్బులు ఇవ్వకుంటే హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
కిడ్నాపర్ల చెర నుంచి ఎలాగొలా బయటపడ్డ సుబ్బయ్య.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాపర్ల కోసం చిత్తూరు జిల్లాతో పాటు కర్నాటక సరిహద్దుల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
