కాటేసిందని పాముని కొరికేశాడు..

కాటేసిందని పాముని కొరికేశాడు..
X

పగలంతా కష్టపడ్డం. రాత్రవగానే ఆ వచ్చిన నాలుగు డబ్బులతో మద్యం తాగడం. ఉత్తరప్రదేశ్‌లోని ఎటవా జిల్లాకు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం తాగి వచ్చి పడుకున్నాడు. ఇంతలో ఎక్కడినుంచో పాము వచ్చి అతడిని కరిచింది. వెంటనే అతడు ఆ పాముని పట్టుకుని కోపంతో కొరికేసాడు. పాము విషపూరితమైనదని ఏ మాత్రం ఆలోచించలేకపోయాడు. దాంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story

RELATED STORIES