కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రాజీనామా

X
TV5 Telugu29 July 2019 7:06 AM GMT
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చదివి వినిపించారు. సంకీర్ణ సర్కారులో 14 నెలల పాటు స్పీకర్ గా పనిచేశారాయన. అంతకుముందు ఆర్ధిక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇవాళ బీజేపీ సర్కార్ విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. స్పీకర్ రాజీనామా చేస్తారనే ప్రచారం ఆదివారం నుంచి కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగా స్పీకర్ తన రాజీనామా లేఖను సభలో చదివి వినిపించడం విశేషం. మరోవైపు, స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు సర్వోన్నత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై 2023 వరకు అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్... రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Next Story