బలపరీక్షలో నెగ్గిన యడియూరప్ప సర్కార్.. ఇకనుంచి బీజేపీ పాలన..

X
TV5 Telugu29 July 2019 6:39 AM GMT
బలపరీక్షలో యడియూరప్ప సర్కార్ నెగ్గింది. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు అదనంగా వచ్చాయి. దీంతో మూజువాణి ఓటుతో యడియూరప్ప సర్కార్ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 104 ఉండగా బీజేపీకి 106 మంది సభ్యుల మద్దతు లభించింది. కాంగ్రెస్, జేడీఎస్ లకు కలిపి 100 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. దీంతో బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. విజయం సాధించిన యడియూరప్పకు మాజీ సీఎం సిద్దరామయ్య అభినందనలు తెలిపారు. ఇకనుంచి కర్ణాటకలో బీజేపీ పాలన సాగనుంది.
Next Story