రవిశేఖర్‌ కేసులో మరో ట్విస్ట్‌.. టీవీల్లో చూసి ఇద్దరు మహిళలు..

రవిశేఖర్‌ కేసులో మరో ట్విస్ట్‌.. టీవీల్లో చూసి ఇద్దరు మహిళలు..

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నల్లమల ఫారెస్ట్‌ ఏరియాలో కిడ్నాపర్‌ రవిశేఖర్‌ ఆనవాళ్లను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ రవి తిరుపతి, కడపలో ఉన్నాడన్న సమాచారంతో అక్కడా పోలీసులు గాలించారు. ఆంధ్ర పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. అటు ఈ కిడ్నాప్‌లో బంధువుల హస్తం ఉందా అన్నా కోణంలోనూ విచారిస్తున్నారు..

సోనీ కిడ్నాప్ వ్యవహరం ఇప్పుడు ఏపీ చుట్టూ తిరుగుతోంది. . స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి ఆంధ్రా- తమిళనాడు, ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు . హైదరాబాద్‌లో తండ్రిని నమ్మించి కూతురు సోనీని తీసుకువెళ్లిన కిడ్నాపర్ రవిశేఖర్‌ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు..

ఈజీ మనీకి అలవాటుపడ్డ రవిశేఖర్ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దృష్టి మళ్లించి పనికానిచ్చేయటంలో దిట్ట. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో పలు దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఓ కేసులో అరెస్టయిన రవిశేఖర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి ఏపీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి హైదరాబాద్‌లో ప్రత్యక్షమై ఫార్మసీ విద్యార్థి సోనీని కిడ్నాప్ చేశాడు.

అటు రవిశేఖర్‌ కేసులో మరో మోసం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇద్దరు మహిళలను మభ్యపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హయత్‌నగర్‌ యువతి కిడ్నాప్‌కు ముందే ఈ ఘటన జరగ్గా.. రెండు మూడ్రోజుల నుంచి టీవీలో వస్తున్న కథనాలను చూసి బాధితులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది..

అటు రవిశేఖర్ కుటుంబ సభ్యులు మాత్రం అతడి నేర ప్రవృత్తితో విసుగెత్తిపోయారు. రవిశేఖర్ తీరుతో తాము అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని వాపోతున్నారు. అతని పట్టుకుని శిక్షించాలంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story