ఇజ్రాయెల్ ప్రధానికి మద్దతుగా మోదీ, ట్రంప్ ప్రచారం

ఇజ్రాయెల్ ప్రధానికి మద్దతుగా మోదీ, ట్రంప్ ప్రచారం

ఇజ్రాయెల్‌లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌లో ప్రచార హోరు ప్రారంభమైంది. అయితే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం అంటే వారు నేరుగా అక్కడ ప్రచారం చేయడం లేదు. నెతన్యాహూతో ట్రంప్, పుతిన్, మోదీ తీసుకున్న ఫొటోలతో ఫ్లెక్సీలు జెరూసలెం వీధుల్లో దర్శనం ఇస్తున్నాయి.

పెద్ద పెద్ద భవంతులపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ జాతీయ ఎన్నికలు సెప్టెంబర్ 17న జరగనున్నాయి. నెతన్యాహు సారధ్యం వహిస్తున్న లుకిడ్ పార్టీ ఈ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మోదీ, నెతన్యాహు ఫ్లెక్సీని నగరంలోని కింగ్ జార్జి ప్రాంతాంలో మెట్జుదాట్ జీవ్ 38లో ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్, భారత ప్రధానులు మంచి మిత్రులు. ఇజ్రాయెల్ ఎన్నికలకు 8 రోజుల ముందు సెప్టెంబర్ 9న మోదీని నెతన్యాహూ కలవనున్నారు. ఇండియాకు వచ్చి స్వయంగా మోదీని కలిసివెళతారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story