‘శివరంజని’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘శివరంజని’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

సస్పెన్స్ అండ్ హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దానికి కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసుకుని వస్తోన్న సినిమా ‘శివరంజని’. నందు, రష్మి గౌతమ్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో నందినీరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

‘శివరంజని’ మూవీ లవ్, సస్పెన్స్, హారర్ తో పాటు థ్రిల్లర్ కూడా మిక్స్ అయిన కథ అన్నారు నిర్మాత ఏ పద్మనాభరెడ్డి. రశ్మి, ముగ్గురు అబ్బాయిల మధ్య జరిగే కథ. ఈ ముగ్గురిలో రశ్మి ఎవరిని ప్రేమించిందనేది సస్పెన్స్ అన్నారు నిర్మాత. ధన్ రాజ్ కామెడీ బాగా నవ్విస్తుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందన్నారు నిర్మాత. మొత్తంగా శివరంజని ఎవరు అనేది తెలుసుకోవడమే సినిమా అన్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.

వాలి సినిమా నుంచి ఇన్స్ స్పైర్ అయి రాసుకున్న కథ అని తెలిపారు దర్శకుడు నాగప్రభాకర్. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Next Story

RELATED STORIES