పై బెర్త్ నుంచి కిందికి దిగుతూ కాలు జారడంతో ఓ మహిళ..

పై బెర్త్ నుంచి కిందికి దిగుతూ కాలు జారడంతో ఓ మహిళ..

రైళ్లలో ప్రయాణించేటప్పుడు దూరప్రయాణాలని బెర్త్‌లు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించమంటున్నారు రైల్వే అధికారులు. పెద్ద వయసు వారు.. అనారోగ్య సమస్యలు ఉన్నవారు అంటే బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులు వున్నవారు పై బెర్తులు తీసుకోవద్దంటున్నారు. ఓ మహిళ రైలు బెర్తుపై నుంచి దిగుతూ కాలు జారి మృతి చెందడాన్ని పరిగణలోకి తీసుకుని ఈ జాగ్రత్తలు చెబుతున్నారు. బెంగళూరులోని సంగోళి రాయన్న రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోల్‌కతా నగరానికి చెందిన సరస్వతీ బనిసల్ బెంగళూరులోని ఓ బ్యూటీ పార్ల‌ర్‌లో పని చేస్తున్నారు. బ్యూటీషియన‌కు సంబంధించిన మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు ముంబయి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తను దిగవలసిన స్టేషన్ వచ్చిందని పై బెర్తులో ఉన్న సరస్వతి క్రిందకు దిగుతోంది. ఆ సమయంలో కాలు జారి క్రిందపడ్డారు. దీంతో ఆమె తలకి గాయమైంది.

వెంటనే తోటి ప్రయాణీకులు స్పందించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించి డాక్టర్‌ని అరేంజ్ చేశారు. అప్పటికి సరస్వతి మాములుగానే మాట్లాడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స్ జరుగుతోంది. అయినా సమయం గడుస్తున్న కొద్దీ సరస్వతికి మాటలు తడబడుతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కేసీ జనరల్ ఆస్పత్రికి తరలించాలని అంబులెన్స్‌ సిద్దం చేశారు. ఆమెను అందులోకి ఎక్కించి తీసుకువెళుతుండగానే మార్గమధ్యలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. ఆసుపత్రికి వెళ్లేలోపే సరస్వతి మరణించింది. పై నుంచి దిగుతూ పడిపోయిన క్రమంలో వెన్నెముకకు బలమైన దెబ్బ తగిలి ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు. అనారోగ్య సమస్యలుంటే అప్పర్ బెర్తులు ఎంచుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story