37ఏళ్ల కష్టం.. విస్తరించిన 'కాఫీ డే' వ్యాపార సామ్రాజ్యం

37ఏళ్ల కష్టం.. విస్తరించిన కాఫీ డే వ్యాపార సామ్రాజ్యం
X

కెఫె కాఫీ డే అధినేత వీజీ సిద్దార్ధ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆర్ధికంగా వేధిస్తున్న సమస్యలపై కంపెనీ డైరెక్టర్లకు, ఉద్యోగులకు లేఖ రాసిన వీజీ సిద్దార్ధ మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో దూకి చనిపోయినట్టు సమాచారం. 27నే లేఖ రాసిన సిద్దార్ధ.. పలు విషయాలను సీరియస్ అంశాలను అందులో పేర్కొన్నారు. తనకు ఎదరైన సవాళ్లు, ప్రమోటర్లు, ఆదాయపన్నుశాఖ అధికారుల వేధింపులు, ఆస్తులు, అప్పులపై లేఖలో వివరించారు. 37ఏళ్ల తన కష్టంతో పాటు మిత్రులు, కుటుంబసభ్యుల సహకారంతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించినట్టు లేఖలో రాసిన వీజీ సిద్దార్ధ.. కంపెనీతో పాటు అనుబంధ సంస్థల్లో 30వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. టెక్నాలజీ సంస్థలో అత్యధిక వాటా కలిగిన మరో సంస్థలోనూ 20వేల మందికి ఉద్యోగులు వచ్చాయన్నారు. ఎంత కష్టపడ్డా.. వ్యాపారాన్ని విజయవంతం చేయలేకపోయినట్టు లేఖలో పేర్కొన్నారు. తనపై నమ్మకముంచిన వారి విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయినట్టు తెలిపారు.

కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఓ ప్రైవేటు ఈక్విటీ ప్రమోటర్‌ షేర్ల బైబ్యాక్‌ కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారని.. అయినా చేయాల్సిందంతా చేసినా వేధిస్తుందన్నారు. అటు ఆదాయపన్ను శాఖ పాత డీజీ కూడా పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని.. షేర్లు అటాచ్‌ చేసి లావాదేవీలు జరగకుండా అడ్డుకున్నారన్నారు. దీని వల్ల ఆర్ధికంగా సమస్యలు తలెత్తాయన్నారు. కంపెనీ నిర్వహణలో శక్తివంచన లేకుండా కష్టపడినట్టు చెప్పిన వీజీ సిద్దార్ధ.. కొత్త మేనేజ్‌ మెంట్ మార్గదర్శకత్వంలో కంపెనీ మరింత ఎత్తుకు వెళుతుందని లేఖలో రాశారు. కంపెనీలో ఇప్పటివరకు జరిగిన ప్రతి లావాదేవీకి తనదే బాధ్యత అంటున్న వీజీ సిద్దార్ధ.. ఆడిటర్లు, కుటుంబసభ్యులు, ఉద్యోగులు ఎవరికీ తన లావాదేవీల గురించి తెలియదన్నారు. జీవితంలో ఎవరినీ మోసం చేయడం తన ఉద్దేశం కాదన్నారు. అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. అర్ధం చేసుకుని మన్నించాలంటూ లేఖలో రాశారు. ఆస్తులు, అప్పులు మొత్తం వివరాలు కూడా లేఖకు అటాచ్‌ చేశారు. అప్పలు కంటే ఆస్తులే ఎక్కువగా ఉన్నాయని.. ప్రతిపైసా తీర్చగల సామర్ధ్యం కంపెనీకి ఉందంటూ లేఖలో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES