దూకడం చూశాను.. ప్రత్యక్ష సాక్షి

X
TV5 Telugu30 July 2019 9:40 AM GMT
కాఫీ డే అధినేత విజీ సిద్దార్ధ మిస్సింగ్ దేశం మొత్తం కలకలం సృష్టిస్తోంది. మాజీ సీఎం అల్లుడు, కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన సిద్దార్థ.. కొన్ని వందల కుటుంబాలకు జీవనాధారమైన వ్యక్తి కనిపించకపోవడంతో ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. అసలు విషయం వెలుగు చూసేవరకు మిస్టరీ వీడదు. అయితే ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
తాను నదిలో చేపలు పడుతుండగా ఎవరో ఒక వ్యక్తి 8వ పిల్లర్ దగ్గర బ్రిడ్జి పై నుంచి దూకడం చూశానని, కాపాడదామన్నా తాను చాలా దూరంలో ఉన్నందువల్ల అక్కడకు వెళ్లలేకపోయానని అంటున్నాడు. కానీ ఎవరో నదిలోదూకినట్లు అనిపించిందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. అతడు చెప్పిన దగ్గర పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. నేత్రావతి నది దగ్గరకు వెళ్లిన సిద్దార్థ సోమవారం సాయింత్రం నుంచి అదృశ్యమైన సంగతి తెలిసిందే.
Next Story