ఆఫర్ ఒక్కరోజే.. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్ రూ.8,999కే..

ఆఫర్ ఒక్కరోజే.. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్ రూ.8,999కే..

కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఈ కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్‌లో పలు స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. జులై 31 వరకు అందుబాటులో ఉన్న ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు బంపరాఫర్లు పొందవచ్చు. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.8,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.19,999. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో 5 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.9 అంగుళాల స్క్రీన్, డ్యూయెల్ రియల్ కెమెరా (16ఎంపీ+2 ఎంపీ), డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా (13 ఎంపీ+2 ఎంపీ),3340 ఎంఏహెచ్ బ్యాటరీ, కిరిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుదారులు 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అదే ఎక్సేంజ్ రూపంలో ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే రూ.8,900 వరకు తగ్గుతుంది. కాగా, నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌పై 60 శాతం వరకు తగ్గింపు ధరకు అందిస్తోంది. నోకియా 6.1 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.7,999గా ఉంది. దీని అసలు ధర రూ.20,095.

Tags

Read MoreRead Less
Next Story