సిద్ధార్థ బోర్డుకు రాసిన లేఖ.. ఆస్తుల కంటే అప్పులు తక్కువే.. అయినా..

సిద్ధార్థ బోర్డుకు రాసిన లేఖ.. ఆస్తుల కంటే అప్పులు తక్కువే.. అయినా..

''నా 37 ఏళ్ల కృషి, పట్టుదల కష్టంతో సుమారు 30 వేల మందికి నా కంపెనీలు, అనుబంధ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 30 వేల ఉద్యోగాలను కల్పించాను. ఓ టెక్నాలజీ కంపెనీలో ప్రారంభం నుంచి ప్రధాన షేర్ హోల్డర్‌గా ఉన్నాను. దాని ద్వారా కూడా సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంత కష్టపడినా లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించడంలో విఫలమయ్యాను. ఇక నేను అశక్తుడినై త్యజిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన మీ అందరినీ నిరుత్సాహపరిచినందుకు క్షమించండి. షేర్లను బైబ్యాక్ చేయమని ప్రైవేట్ ఈక్విటీ సంస్థల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. రుణదాతల నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి ఇక తట్టుకునే శక్తి నాకు లేదు. మైండ్ ట్రీ బ్లాక్ డీల్ విషయంలో రెండు సార్లు కాఫీడే షేర్లను ఐటీ శాఖ డైరెక్టర్ జనరల్ ఎటాచ్ చేశారు. ఐటీ శాఖ కూడా తీవ్రంగా హింసించింది. రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా మమ్మల్ని వేధించారు. దీని వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి కంపెనీ వెళ్లింది.

ఈ పరిస్థితుల్లో మీరంతా ధైర్యంగా ఉండండి, వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించాలని నేను అభ్యర్థిస్తున్నాను. అన్ని తప్పులకూ నాదే బాధ్యత. ప్రతీ ఆర్థిక లావాదేవీకి నాదే బాధ్యత. నా టీం, ఆడిటర్లు, సీనియర్ మేనేజ్‌‌మెంట్ ఎవరికీ నేను చేసిన లావాదేవీల గురించి అవగాహన లేదు. చట్టం నన్ను మాత్రమే బాధ్యుడిని చేయాలి. ఏ సమాచారాన్ని నా కుటుంబానికి కూడా తెలియనివ్వలేదు. ఎవరినీ మోసగించాలని, తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. వ్యాపారిగా నేను విఫలమయ్యాను. ఏదో ఒక రోజు మీరు నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని భావిస్తున్నాను. నా ఆస్తులకు సంబంధించిన చిట్టాను ఈ లేఖతో జత చేస్తున్నాను. ఆస్తుల కంటే అప్పులు తక్కువే ఉన్నాయి, సులువుగా వాటిని తీర్చేయవచ్చు''.

మీ

విజి సిద్ధార్థ

తేదీ - 27/07/19

Tags

Read MoreRead Less
Next Story