ఆ స్కూల్‌లో చదవడమే విద్యార్థులకు శాపమైందా?

వాళ్లంతా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. ఓవైపు భారీ వర్షాలు కురుస్తుంటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 30 ఏళ్ల క్రితం కట్టిన స్కూల్ భవనం ఎక్కడ కూలుతుందోని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్నారు. నెత్తిన ఎక్కడ స్లాబ్ పడుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇక రోజూ భయపడటం వల్ల ఉపయోగంలేదని రోడ్డెక్కారు. తమకోసం కొత్త భవనం నిర్మించాలని ధర్నా చేపట్టారు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరపేటలో జరిగింది.
చిన్నశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 620 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షాకాలంలో ఇక్కడ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. భవనం శిథిలావస్థకు చేరడంతో చినుకు పడితే సెలవు ఇవ్వడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. కొత్తగా 4 గదులు నిర్మించినా విద్యార్థుల సంఖ్య పెరిగి అవి సరిపోవడంలేదు. ఐదేళ్లుగా ఎన్నోసార్లు అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ధర్నా, రాస్తోరోకోకు దిగారు. మెదక్ - చేగుంట రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com